48 గంటల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:ఎస్పి రాహుల్ హెగ్డే

48 గంటల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:ఎస్పి రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికలకు( Assembly Elections ) సంబంధించి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలకు ఇచ్చిన ప్రచార సమయం ముగిసిందని, 48 గంటల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde )అన్నారు.

48 గంటల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:ఎస్పి రాహుల్ హెగ్డే

జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎవ్వరు కూడా ప్రచారం చేయొద్దని,సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్ బుక్,ట్విట్టర్, ఇన్స్త్రా గ్రామ్ లలో ఆన్లైన్ ఎస్ఎంఎస్ రూపంలో కూడా ప్రచారం చేయకూడదని తెలిపారు.

48 గంటల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:ఎస్పి రాహుల్ హెగ్డే

జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, 5 గురు కంటే ఎక్కువగా గుంపులుగా ఉండవద్దని, సభలు,సమావేశాలు,ర్యాలీలు చేయవద్దన్నారు.

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్నికల నియమావళికి లోబడి ప్రతిఒక్కరూ నడుచుకోవాలని,రెచ్చగొట్టడం,తగాదాలు, గొడవలు పడటం చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ఎన్నికల కేసులు ఒకసారి నమోదైతే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, విద్యార్థులు,యువత కేసుల్లో ఇరుకుంటే ఉద్యోగాలు,విదేశాల చదువు విషయంలో సమస్యలు వస్తాయని చెప్పారు.

ప్రచారం సమయం ముగియడంతో ఓటరు కానివారు, స్థానికేతరులు నియోజకవర్గాలు, గ్రామాలు,వార్డులు వదిలి వెళ్లిపోవాలని,48 గంటల నిబంధనలు అమలు విషయంలో పోలీస్ నిచితమైన నిఘా ఉన్నదని గుర్తు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని,100 మీటర్లు,200 మీటర్లు పరిధి ఆంక్షలు అమలు చేస్తున్నామని,ప్రతీ ఒక్కరూ పోలీసు సూచనలు,ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.

హలో అబ్బాయిలు జుట్టు ఒత్తుగా మారాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే..!

హలో అబ్బాయిలు జుట్టు ఒత్తుగా మారాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే..!