క్రీడా అవార్డులు అందుకోవాల్సిన వారు..కరోనా బారిన పడ్డారు!
TeluguStop.com
భారత ఖేల్ రత్న అందుకున్న క్రీడాకారులు కొందరు కరోనా బారిన పడడం తో ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తుంది.
ఖేల్ రత్న కు ఎంపికైన ఆనందం వారిలో నిలవనీయకుండా కరోనా వారిని కట్టడి చేసేసింది.
ఖేల్ రత్న కు ఎంపికైన విమెన్ స్టార్ రెజ్లర్ వినేశ్ పోగాట్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో ఆమె ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమానికి దూరమైనట్లు తెలుస్తుంది.
స్వస్థలం సోన్పేట్లో కోచ్ ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్ కోసం వినేశ్ ట్రైనింగ్ తీసుకుంటోంది.
ఈ సమయంలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవ్వడం తో ఖేల్ రత్న ను డైరక్ట్ గా అందుకునేందుకు వీలులేకుండా పోయింది.
త్వరలో కోలుకుంటానని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నట్లు వినేశ్ ఫోగాట్ తెలిపింది.గతంలో ఈమె ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది.
అలానే క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా పురస్కారం అందుకోవాల్సిన తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ (అర్జున) కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడే ఈ ప్రదానోత్సవానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
మరోపక్క క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అథ్లెట్ లకు క్రీడా పురస్కారాలు అందించారు.
హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ రోజు న దేశంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో క్రీడా పురస్కారాలను అందించడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఈ సారి కూడా పలువురు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అవార్డులను అందించి ప్రోత్సహించారు.
డైరెక్టర్ పరుశురాం ఎవ్వరితో సినిమా చేస్తున్నాడు..?