ఆ దర్శకునికి చనువు ఇస్తే ఏం చేస్తాడో బాగా తెలుసు.. యాంకర్ వింధ్య ఏమన్నారంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఇప్పుడు చేతిలో సరైన ఆఫర్లు లేక రాజకీయ సినిమాలు, చెత్త సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ దర్శకుని గురించి సెలబ్రిటీలలో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.యాంకర్లను టార్గెట్ చేస్తూ చేసే డబుల్ మీనింగ్ కామెంట్లపై మీ ఒపీనియన్ ఏంటి అని ఆమెను ప్రశ్నించగా నా వరకు నేను జాగ్రత్తగా ఉంటానని ఆమె తెలిపారు.
ఆర్జీవీ హాజరయ్యే ఈవెంట్ అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.ఆర్జీవీకి చనువిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారని వింధ్య వెల్లడించారు.
రామ్ గోపాల్ వర్మకు నేను అంత సీన్ ఇవ్వనని రామ్ గోపాల్ వర్మను పొగుడుతూ కామెంట్లు చేస్తే డబుల్ మీనింగ్ సెటైర్లతో రెచ్చిపోతాడని వింధ్య ( Vindhya )వెల్లడించారు.
అంతకంటే ఒక్క మాట కూడా మాట్లాడనని మన లిమిట్స్ లో మనం ఉంటే మనల్ని ఎవరూ టచ్ చేయలేరని వింధ్య పేర్కొనడం గమనార్హం.
"""/" /
ఆఫర్ల కోసం చనువుగా బిహేవ్ చేయడం, ఒకరి దగ్గరికి వెళ్లి నాకు ఆఫర్లు ఇవ్వాలని అడగడం చేయలేదని వింధ్య అన్నారు.
ఒకే ఒక్క నిర్మాణ సంస్థను తాను ఆఫర్ ఇవ్వాలని అడిగానని ఆ సంస్థ నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదని వింధ్య వెల్లడించారు.
జబర్దస్త్ షోలో చేసే వెకిలి కామెడీ నాకు నచ్చదని వింధ్య పేర్కొన్నారు.వింధ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
"""/" /
ఐపీఎల్ తెలుగు కామెంటరీ ద్వారా వింధ్య అంతకంతకూ పాపులర్ అవ్వడం గమనార్హం.
వింధ్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.వింధ్య రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.
ఇతర యాంకర్లకు భిన్నంగా వింధ్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు.వింధ్య విశాఖ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సౌదీలో సినిమా థియేటర్లకు బకెట్లు, డ్రమ్ములు ఎందుకు తెస్తున్నారో తెలుసా? రీజన్ తెలిస్తే మైండ్ బ్లాక్!