ఎన్ఆర్ఐ అల్లుడి దుర్మార్గం: భార్యను పుట్టింట్లోనే వదిలి, ఆరేళ్లుగా పైశాచికం

ఎన్ఆర్ఐ అల్లుడి దుర్మార్గం: భార్యను పుట్టింట్లోనే వదిలి, ఆరేళ్లుగా పైశాచికం

వేధింపులకు ఎంతమంది ఆడబిడ్డలు బలవుతున్నా.ఎన్ని కాపురాలు కూలిపోతున్నా భారతీయ తల్లిదండ్రులకు ఎన్ఆర్ఐ అల్లుళ్లపై మాత్రం మోజు తగ్గడం లేదు.

ఎన్ఆర్ఐ అల్లుడి దుర్మార్గం: భార్యను పుట్టింట్లోనే వదిలి, ఆరేళ్లుగా పైశాచికం

తాజాగా తన భర్త తనను తీవ్ర వేధింపులకు గురిచేసి, హైదరాబాద్‌లో వదిలి వెళ్లిపోయినట్లు 26 ఏళ్ల వివాహిత జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎన్ఆర్ఐ అల్లుడి దుర్మార్గం: భార్యను పుట్టింట్లోనే వదిలి, ఆరేళ్లుగా పైశాచికం

తాను 2013లో హిందూ సంప్రదాయం ప్రకారం షెరు వినయ్ అలియాస్ వినయ్ క్రిస్టోఫ్‌ను వివాహం చేసుకున్నానని షెరు సాయి మాధవి ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనితో పాటు ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ ఆచారాల ప్రకారం కూడా వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

పెళ్లి తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లామని అక్కడ తమతో పాటు మంజులా, మోహన్‌లతో నివసిస్తున్నట్లు చెప్పారు.

అయితే వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత తన భర్త, అతని తల్లిదండ్రులు తనను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు.

 "/" /జూలై 2014లో తన విజిటింగ్ వీసా గడువు ముగుస్తున్నందున మంజుల తనను భారతదేశానికి తీసుకొచ్చి, హైదరాబాద్‌లో వదిలి తిరిగి వెళ్లిపోయినట్లు ఆమె వెల్లడించారు.

దీనిపై తాను ఎన్నో సార్లు వినయ్, అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేశానని, ఈమెయిల్స్ చేశానప్పటికీ వారు స్పందించలేదని మాధవి తెలిపారు.

ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498-ఎ గృహహింస కింద వినయ్ అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు… కన్నీళ్లు పెట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్! 

చిన్నప్పుడే లైంగిక వేధింపులు… కన్నీళ్లు పెట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్!