గర్భవతికి పురిటి నొప్పులు రావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు నుండి దాటించిన గ్రామస్థులు..

ఓ గర్భవతి అయిన యువతికి పురిటి నొప్పులు రావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు నుండి గ్రామస్థులు తరలించిన సంఘటన.

తిరుపతి జిల్లా, నాగలాపురం మండలంలోని కొట్టకాడులో చోటుచేసుకుంది.ప్రతిభ అనే యువతికి పురిటినొప్పులు వచ్చాయి.

అయితే తీవ్ర వర్ష ప్రభావంతో ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయాయి.దీంతో గ్రామస్థులు, కుటుంబీకులు ఆమెను చేతులతో మోసుకుని వాగుని దాటిస్తున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

ఘటనపై అధికారులు స్పందించి వెంటనే సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వీడియో వైరల్.. భార్యతో కలిసి రెచ్చిపోయిన ట్రంప్