టెంపుల్ సహాయ కమిషనర్ కు గ్రామస్తుడు ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ సహాయ కమిషనర్ కు చందుర్తి మండలం నర్సింగపూర్ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి దేవస్థానం కు ఒక భక్తుడు మొక్కుగా సమర్పించిన ఆవు, లేగ దూడను ఇవ్వడం జరిగింది.

ఆలయ పూజారి, ఒగ్గు కళాకారులు కలిసి గ్రామ కమిటీ గాని ఎవరికీ తెలియజేయకుండా కటిక వాళ్లకు కోతకు దేవస్థానానికి ఇచ్చినటువంటి ఆవు, దూడను అమ్మడం జరిగింది.

ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని కూడా తన సొంత లాభాల కోసం వాడుతున్నాడని కమిషనర్ కి విన్నవించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్ సభ్యులు కాసారపు శ్రీనివాస్,పెరుక గంగరాజు చింతకుంట గంగాధర్, ఇల్లంతకుంట గణేష్,కొత్త ఎలారెడ్డి, సంపూనూరి దశరథం ఉన్నారు.

నటి కస్తూరిపై కేసు నమోదు.. క్షమాపణ చెప్పిన వదలడం లేదుగా!