ఆ కాలనీలో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
TeluguStop.com

ఇండియాలో ప్రతి ఇంటికి ఇప్పుడు వీధి కుళాయి కనెక్షన్ లని ప్రభుత్వం ఇచ్చింది.


అయితే ఈ కులాయిలు తిప్పితే త్రాగునీరు వస్తుంది.మన ఇండియాలో అయితే కొన్ని చోట్ల మురుకునీరు కూడా వస్తుంది.


అరబిక్ దేశాలలో అయితే అక్కడ పెట్రోల్ నిల్వలు ఎక్కువ కాబట్టి పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది.
కృత్రిమంగా తయారయ్యే మద్యం కుళాయిల నుంచి రావడం అంటే కాస్తా ఆశ్చర్యంగానే ఉంటుంది.
అయితే కేరళలోని త్రిశూర్ ఓ కాలనీలో నీటి కోసం కుళాయిలు తిప్పిన వారికి ఊహించని విధంగా మద్యం రావడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.
ఇదేదో వింత అనుకోని చాలా మంది ఆ కాలనీకి వెళ్లి వింతని చూడటం మొదలెట్టారు.
అయితే దీనిపై స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు.దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఆరేళ్ళ క్రితం ఆరేళ్ల క్రితం సోలోమన్ అవెన్యూకు సమీపంలో ఉండే రచనా బార్‌లో అక్రమంగా వేల లీటర్ల మద్యం నిల్వలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి.
ఆ సమయంలో పోలీసులు ఆ బార్ పై దాడి చేసి సుమారు 6 వేల లీటర్ల మద్యం బాటిళ్లను నాశనం చేసి ఓ గొయ్యి తీసి మద్యాన్ని దాంట్లో నింపేశారు.
అది భూమిలో పూర్తిగా ఇంకిపోయింది.అయితే బార్‌కు సమీపంలోనే ఈ అపార్ట్‌మెంట్ నిర్మించడంతో అక్కడి బోరుబావిలోకి మద్యం చేరింది.
నీటితో కలసి కుళాయిల్లోకి ప్రవహించింది అని ఆబ్కారీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమే తప్ప ఎవరో కావాలని చేసింది కాదని తెలిపారు.
మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా ఇప్పుడు సంచలనంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అయ్యింది.
బంగాళదుంపతో ఈ ఆహారాలు కలిపి తినకూడదని మీకు తెలుసా?