తొలి రోజు అసెంబ్లీ సమావేశం ఆరు నిమిషాలు జరగటం పట్ల బట్టి విక్రమార్క సీరియస్..!!
TeluguStop.com
నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడం తెలిసిందే.దాదాపు మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
ముందుగా మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం ఇంకా జనార్దన్ రెడ్డి మృతి పట్ల సభ సంతాపం ప్రకటించింది.
అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 12వ తేదీకి వాయిదా వేయటం జరిగింది.
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం తీరు పట్ల విమర్శలు చేశారు.
20 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరితే రెండు రోజులే పెట్టడం దారుణమని అన్నారు.
ఇవ్వాలా మొదటి రోజు సభను ఆరు నిమిషాలు నడపడం హాస్యాస్పదమన్నారు.బిఎసిలో తమ మాట కూడా వినలేదని ఆరోపించారు.
పోడు భూములు, నిరుద్యోగ సమస్యలు విభజన చట్టంలోని హక్కులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో బట్టి విక్రమార్క గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?