Vikram : ఆరోజు నన్ను కాదని బాహుబలికి ప్రాధాన్యత ఇచ్చారు.. విక్రమ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు హీరో చియాన్ విక్రమ్( Vikram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆయన నటించిన సినిమాలు ఎన్నో తెలుగులోకి విడుదలైన విషయం తెలిసిందే.తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు.

విక్రమ్ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా అపరిచితుడు.ఈ సినిమాతో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విక్రమ్.

కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది.

ఈయన వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక సినిమాలలో పాత్ర కోసం ఎంత కష్టమైన సరే ఇష్టంగా చేస్తూ ఉంటారు.

తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విక్రమ్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం తంగలాన్( Thangalaan ) తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా విడుదల అయిన టీజర్ లో విక్రమ్ నటన, బాడీ లాంగ్వేజ్ వణుకు పుట్టించేలా ఉన్నాయి.

విచిత్రమైన అఘోర తరహా గెటప్ లో విక్రమ్ జీవించాడు అనే చెప్పవచ్చు.ఇందులో మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటిస్తోంది.

"""/" / జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

టీజర్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది.

మీడియా సమావేశంలో విక్రమ్ కూడా పాల్గొన్నారు.ఆ సమావేశంలో విక్రమ్ కి రిపోర్టర్స్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

తమిళ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసినంతగా తెలుగు సినిమాని తమిళ ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం లేదు దీనికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.

విక్రమ్ బదులిస్తూ.అందులో వాస్తవం లేదు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తమిళనాడులో టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి కదా.

"""/" / తెలుగు సినిమాకి మేము ఎంత ప్రాముఖ్యత ఇస్తాం అనేదానికి ఒక ఉదాహరణ చెబుతాను.

ఐ చిత్రానికి మేము జాతీయ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమిళ జ్యూరీ మెంబర్ ఒకరు నాకు చెప్పారు.

మేము బాహుబలి తమిళ వర్షన్ ని జాతీయ అవార్డులకు పంపాలని ప్రయత్నిస్తున్నాం.అందుకే మీ చిత్రానికి సపోర్ట్ చేయలేకున్నాం అని చెప్పారు.

ఇక్కడ చూడండి తెలుగు సినిమాకి మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అని విక్రమ్ అన్నారు.

ఇతర భాషా చిత్రాలన్నీ తమిళంలో బాగా ఆడాయి.కాంతారా, కెజిఎఫ్ చిత్రాలే అందుకు ఉదాహరణ.

నిర్మాత జ్ఞానవేల్ రాజా( Gnanavel Raja ) కూడా ఈ విషయాన్ని ఖండించారు.

మేకర్స్ మైండ్ సెట్ మారాలని ఇప్పుడు సినిమాకి భాషా బేధం లేదని అన్నారు.

ఈ సందర్భంగా విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?