తెలుగు డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విక్రమ్…ఇది మరో అపరిచితుడు అవుతుందా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విక్రమ్( Vikram ) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయాలను సాదిస్తుందటం విశేషం.

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తెలుగులో స్ట్రైయిట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన తంగలాన్ సినిమా ( Tangalan Movie ) తమిళంలోనూ, తెలుగులోను మంచి విజయాన్ని అందుకొని పెను ప్రభంజనాన్ని సృష్టించింది.

"""/" / కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

అందువల్లే కొంతమంది దర్శకులతో ఆయన డీలింగ్స్ ని కూడా జరుపుతున్నారట.మరి మొత్తానికైతే వెంకీ అట్లూరి ( Venky Atluri )డైరెక్షన్ లో ఈయన ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

నిజానికి వెంకీ అట్లూరి ఇప్పటికి వేరే సబ్జెక్టులో బిజీగా ఉన్నప్పటికీ తన తదుపరి సబ్జెక్టుని మాత్రం విక్రమ్ తోనే చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇప్పటికే ధనుష్ సార్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఆ సినిమాతో ధనుష్ కి తెలుగులో మంచి క్రేజ్ అయితే వచ్చింది.

ఇప్పుడు విక్రమ్ తో కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. """/" / ఎప్పటి నుంచో తెలుగు స్ట్రైయిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కి కూడా ఇది చాలా మంచి విషయమనే చెప్పాలి.

ఆయన చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలని ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

అయినప్పటికి తనకి సరిపడా కథను ఎవరు రెడీ చేయకపోవడంతో ఆయన ఎప్పటికప్పుడు తెలుగు సినిమా చేయాలనే తన కోరికను వాయిదా వేస్తూ వస్తున్నాడు.

ఇక ఎట్టకేలకు వెంకీ అట్లూరి లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ తో తను సినిమాని చేయబోతున్నాడు అనే వార్త రావడం తో ఇప్పుడు అతని అభిమానులు కూడా చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక వెంకీ రాసుకున్న కథ కూడా చాలా కొత్తగా ఉండటమే కాకుండా విక్రమ్ చేసిన అపరిచితుడు సినిమాను మైమరిపించేలా ఉండబోతుందంటు వార్తలైతే వస్తున్నాయి.

బాలయ్య కృష్ణుడు.. ఎన్టీఆర్ అర్జునుడు.. ఈ వార్తలు నిజమైతే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!