అపరిచితుడు రీమేక్ కు నన్ను ఎందుకు తీసుకోలేదో.. విక్రమ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

చియాన్ విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అపరిచితుడు.( Aparichitudu ) 2005లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే టీవీలకు అతుక్కుని పోయి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఎప్పటినుంచో ఈ సినిమా రీమేక్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా రీమేక్ పై స్పందించారు విక్రమ్.( Vikram ) హిందీ వెర్షన్‌ రీమేక్‌లో రణ్‌వీర్‌సింగ్‌( Ranveer Singh ) నటించడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

"""/" / తంగలాన్( Thangalaan ) చిత్రం హిందీలో విడుదల సందర్భంగా ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

అపరిచితుడు రీమేక్‌ గురించి శంకర్‌కు( Shankar ) మాత్రమే తెలుసు.రీమేక్‌ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి.

ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన చిత్రం.రణ్‌వీర్‌సింగ్‌ ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్‌ చేస్తాడని నాకు నమ్మకం ఉంది.

ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్‌ కూడా ఒకరు.ఆయన్ని అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్‌ చూడాలనుంది అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా విక్రమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / 20005 లో మొదలైన అపరిచితుడు సినిమా నిర్లక్ష్యం స్వార్థం అవినీతి వంటి విషయాల్లో ముక్కుసూటిగా ప్రశ్నించే సినిమా.

ఈ సినిమా అప్పట్లో చాలామంది ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే.చాలామందిలో ఈ సినిమా మార్పును కూడా తెచ్చింది.

2021లోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలని ప్రయత్నాలు చేశారు.రణ్‌వీర్‌ హీరోగా ఇది రానున్నట్లు శంకర్‌ అప్పట్లో శంకర్‌ ప్రకటించారు.

పెన్‌ స్టూడియోస్‌ సంస్థలో జయంతిలాల్‌ గడ దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారు.

అయితే, ఈ సినిమా నిర్మాత హిందీ రీమేక్‌కు సంబంధించిన ఆర్థిక అంశాలపై కోర్టును ఆశ్రయించారు.

అప్పటినుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.మరోసారి ఈ సినిమా ప్రస్తావన తెరపైకి వచ్చింది కాబట్టి శంకర్‌ దీనిపై దృషి పెడతారేమో చూడాలి మరీ.

కాంగ్రెస్ లోకి చేరికలు లేనట్టేనా ? కారణం అదేనా ?