విక్రమ్ కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. కోబ్రా మూవీ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

విక్రమ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో విక్రమ్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

అయితే ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన కోబ్రా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని విక్రమ్ భావిస్తున్నారు.

ప్రముఖ క్రిటిక్ లలో ఒకరైన ఉమైర్ సంధు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ప్రేక్షకులు విక్రమ్ సినిమాల నుంచి కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్రయూనిట్ చెబుతోంది.

యాక్షన్ సన్నివేశాలు, ఇతర ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాలో విక్రమ్ 9 నుంచి 10 గెటప్ లలో కనిపిస్తారని సమాచారం.

"""/" / ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఈ సినిమా ఉంటుందని బోగట్టా.

శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో ఆమె అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉమైర్ సంధు తన రివ్యూలో ఈ సినిమా యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని డైరెక్షన్ టెర్రిఫిక్ గా ఉందని అన్నారు.

ప్రొడక్షన్ డిజైన్, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. """/" / కోబ్రా సినిమాకు నా రేటింగ్ 3.

5 అని ఆయన తెలిపారు.మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు పండగలా ఈ సినిమా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ వల్ల ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ సినిమాతో విక్రమ్ కు ఆయన కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

కోబ్రా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ర‌క్త‌హీన‌త వేధిస్తుందా.. నీర‌సంగా ఉంటుందా.. అయితే ఈ జ్యూస్ మీకే!