ఎట్టకేలకు హీరో విక్రమ్‌కి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు.. ఇక మంచి రోజులు వచ్చేశాయి
TeluguStop.com
అపరిచితుడు( Aparichitudu ) హీరో విక్రమ్ ( VIKRAM )ఎప్పుడూ రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నమైన సినిమాలను సెలెక్ట్ చేసుకుంటాడు.
డిఫరెంట్ కాన్సెప్టులతో సాహసాలు చేస్తాడు.అయితే ఆయనలాగా సాహసాలు చేసే దర్శకులు, నిర్మాతలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే విక్రమ్ చాలా అరుదుగా సినిమాలు చేస్తుంటాడు శంకర్ తర్వాత మళ్లీ విక్రమ్ కి మరొక టాలెంటెడ్, చాలా సాహసం చేయగల దర్శకుడు దొరికాడు.
అతనితో కలిసి చేసిన సినిమాయే "తంగలాన్( Thangalaan )".ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ బలవంతంగా జొప్పించలేదు.
కథను స్ట్రెయిట్‌గానే చెబుతూ ఎక్కడా డీవియేషన్ లేకుండా దర్శకుడు పూర్తి చేశాడు. """/" /
దీన్ని గొప్పగా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఇక తన సినిమాలోని క్యారెక్టర్ కి 100% న్యాయం చేయడానికి విక్రం ఎంతటి సాహసమైనా చేస్తాడని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
బాడీ కూడా చేంజ్ చేసుకుంటాడు.ఎలాంటి మేకప్ కాస్ట్యూమ్స్ అయినా వేసుకుంటాడు ఈ సినిమాలో కూడా అతను చాలా కష్టపడ్డాడు.
ఇక నటనలో ఇరగదీసేస్తాడు.మన తెలుగువారి కూడా ఇలాంటి పాత్రలను చేయగలరేమో కానీ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపించరు.
"""/" /
తంగలాన్ స్టోరీ ఓ పూర్వకాలం నాటి తెగ చుట్టూ తిరుగుతుంది.
ఇది ఒక పిరియాడికల్ డ్రామా అని చెప్పుకోవచ్చు.ఆ తెగ ప్రజలు కోలార్ బంగారు గనులకు సమీపంలో నివసిస్తుంది.
అయితే బ్రిటిష్ వాళ్లు ఈ తెగ ప్రజలకు కాస్తో కూస్తో డబ్బులు ఇచ్చి వాళ్లతో ఆ గనుల్లో కారం కోసం వెతికించాలని భావిస్తారు.
దీనివల్ల లాభమే అని హీరో అనుకుంటాడు.హీరోయిన్ ఆరతి మాత్రం దీనివల్ల నష్టమని భావిస్తుంది.
ఆ ప్రయత్నాలను అడ్డుకుంటుంది.ఈ పాత్రలో మాళవిక మోహనన్( Malavika Mohanan ) నటించింది.
ఈ సినిమాలో అడవులు, ఆదివాసీలు, బంగారు గనులు, ఆంగ్లేయులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్నీ కొత్తగానే కనిపిస్తాయి.
అయితే కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన వారు ఈ సినిమాని ఇష్టపడలేకపోవచ్చు.మూవీలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.
స్క్రీన్ ప్లే కొద్దిగా స్లోగా సాగుతుంది.ఈ మూవీ ఇతర ఇండస్ట్రీలో హిట్ కాకపోవచ్చు కానీ తమిళంలో మాత్రం పక్కా హిట్ అవుతుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలను ఇష్టపడేవారు దీన్ని కచ్చితంగా చూడవచ్చు.
చొక్కాలను చింపుకొని మరీ బాదుకున్న వ్యాపారస్తులు… దేనికోసం అంటే?