నా రెండో కూతురు కడుపులో ఉన్న సమయంలో మొక్కని దేవుడు లేడన్న నటి.. ఏమైందంటే?
TeluguStop.com
బాలయ్య సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో అఖండ సినిమా( Akhanda ) ఒకటనే సంగతి తెలిసిందే.
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటించడం గమనార్హం.
విజి చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్త దుబాయ్ లో ఉంటున్నారని తెలిపారు.
టెలివిజన్ లో నేను ఎక్కువగా టైటిల్ రోల్స్ లో చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
నేను నా సినీ కెరీర్ లో కేవలం 35 సినిమాలు చేశానని ఆమె తెలిపారు.
నేను టీవీలలో ఏకంగా 25,000 ఎపిసోడ్స్ లో చేశనాని విజి చంద్రశేఖర్( Viji Chandrasekhar ) పేర్కొన్నారు.
నేను యాక్ట్ చేసిన సీరియల్ తెలుగులో అమ్మ పేరుతో( Amma ) డబ్ అయిందని ఆమె తెలిపారు.
నా చిన్న కూతురు త్వరలో తెలుగులో ఎంట్రీ ఇస్తుందని విజి చంద్రశేఖర్ అన్నారు.
నా రెండో కూతురు కడుపులో ఉన్న సమయంలో నాకు ఆడపిల్లే కావాలని మొక్కని దేవుడు లేడని విజి చంద్రశేఖర్ అన్నారు.
"""/" /
మగపిల్లలపై నాకు అంత ప్రేమ లేదని మా అక్క కొడుకుల్ని నేను పెంచడంతో వాళ్లనే నేను కొడుకులుగా భావించి ఇద్దరు కూతుళ్లు కావాలని అనుకున్నానని ఆమె పేర్కొన్నారు.
నటి సరిత పిల్లలను నేను చిన్నప్పుడు పెంచానని విజి చంద్రశేఖర్ అన్నారు.ఈరోజుల్లో ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేదని విజి చంద్రశేఖర్ కామెంట్లు చేశారు.
"""/" /
నేను కొన్ని ఘటనలు జరిగిన సమయంలో పిల్లల్ని ఎలా పెంచారని అనిపిస్తుందని ఆమె అన్నారు.
పిల్లలకు ఎథిక్స్ నేర్పించాలని ఆమె అన్నారు.హౌస్ వైఫ్ అంటే ఫుల్ టైమ్ వర్కర్ అని విజి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇంట్లో ఎంతమంది పనివాళ్లు ఉన్నా అన్ని పనులను నేను కూడా ఆర్గానిక్ ఫామింగ్ అంటే నాకు ఇష్టమని ఆమె తెలిపారు.
భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం