లియో ఫస్ట్ సింగిల్ కు టైం లాక్.. విజయ్ బర్త్ డే ట్రీట్ మాములుగా ఉండదట!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

మరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫలితంగా ఈయన నటిస్తున్న లియో సినిమా నుండి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో సందడి స్టార్ట్ అయ్యింది.

ఇక ఫస్ట్ లుక్ బాగా ఆకట్టు కోవడంతో ఇప్పడూ ఫస్ట్ సింగిల్ గురించి అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

లియో సినిమా లోని మొదటి సాంగ్ కు డేట్ అండ్ టైం ఫిక్స్ చేసారు.

విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా 'లియో( LEO )'ను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

"""/" / జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు మొదటి సాంగ్ 'నా రెడీ' పాటను( Naa Ready Song ) రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

ఈ సాంగ్ పై సూపర్ క్రేజ్ నెలకొంది.కొత్త పోస్టర్ రిలీజ్ అవ్వగా ఈ పోస్టర్ ను చూస్తుంటే ఫుల్ పార్టీ సాంగ్ అని తెలుస్తుంది.

మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

"""/" / తమిళ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichandran )సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..