ఓవైపు రాజ్యసభ మరోవైపు మూడు సంచలనం సృష్టిస్తున్న విజయేంద్ర ప్రసాద్

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే.తన కథలతో ఎప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న విజయేంద్రప్రసాద్ ఇప్పుడు ఏకంగా మూడు భారీ సబ్జెక్టుతో యమ బిజీగా ఉన్నారు.

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎలివేట్ చేసే క్రమంలో ఇప్పటికే కథ సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్, ఆ కథకు సంబంధించిన క్యారెక్టర్స్ అలాగే ఎలివేషన్స్ స్క్రిప్ట్ వర్క్ పైన పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కథ భారీ అడ్వెంచర్స్ త్రిల్లర్ అనేది కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న కథ కావడంతో అందరి అంచనాలు కూడా భారీగా ఉన్నాయి ఈ సినిమాపై.

ఇక ఇప్పటికే బాహుబలి, బజరంగ్ భాయిజాన్, ఆర్ ఆర్ ఆర్ వంటి సక్సెస్ఫుల్ ఇండియా సినిమాలకు కథలు అందించిన రైటర్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఫేమస్ అయ్యారు విజయేంద్ర ప్రసాద్ రజాకార్ల అరాచకాలు అక్రమాలపై ఓ కథ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

కాసిం రజిని నాయకత్వంలో జరిగిన అనేక అక్రమాలపై త్వరలోనే ఓ సినిమా రాబోతుండగా ఇలాంటి ఒక కథకు తెర రూపం తీసుకురావడం అనేది కేవలం విజయేంద్ర ప్రసాద్ కే చెల్లింది.

తెలంగాణ చరిత్రలో రజాకర్ల ఆకృత్యాలు ఇప్పటి తరం యువతకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనేదే విజయేంద్రప్రసాద్ లక్ష్యంగా తెలుస్తోంది.

"""/"/ ఇక ఈ రెండు కథలు కాకుండా మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆయన బయోపిక్ సంబంధించిన కథను కూడా విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్నారు.

బొంబాయి రాష్ట్రంలో చంద్రపూర్ కార్హడే లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మోహన్ మధుకర్ భగవత్.

ఆర్ఎస్ఎస్ చీఫ్ గా మోహన్ భగవత్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో 2017 లో రాష్ట్రపతి భవన్ కి ఆహ్వానం అందుకున్న మొదటి చీఫ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఈయన జీవిత కథ రూపం తెచ్చేందుకు ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారట.

మూడు సంచలనాలకు తెరతీస్తున్న విజయేంద్రప్రసాద్ మరోవైపు రాజ్యసభకు ఎంపిక కావడం మన తెలుగు ఖ్యాతిని యావత్ దేశం నలుమూలలా వ్యాప్తింపజేసేలా చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పట్టపగలు మహిళను అసభ్యంగా తాకిన నీచుడు.. వీడియో చూస్తే రక్తం మరుగుద్ది!