సీఎం జగన్ పై దాడి కేసు.. బెజవాడ పోలీసుల కీలక ప్రకటన

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై దాడి కేసులో బెజవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు.సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుల వివరాలు చెబితే రూ.

2 లక్షల నగదు బహుమతి ఇస్తామని బెజవాడ పోలీసులు ప్రకటించారు.సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్( Cellphone Video Recording ) లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అయితే 13వ తేదీన మేమంతా బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( MLA Vellampalli Srinivas ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్ వీడియో: కుక్క చేసిన పనికి చప్పట్లు కొట్టిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..