తుని కేసులో విజయవాడ కోర్టుకు ముద్రగడ పద్మనాభం
TeluguStop.com
తుని కేసులో విజయవాడ కోర్టుకు ముద్రగడ పద్మనాభం హాజరైయ్యారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారి.
తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనానికి గురైన విషయం తెలిసిందే.
ఈ కేసులో మొత్తం 40 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ కేసు నేపథ్యంలో ముద్రగడ ఇవాళ విజయవాడు కోర్టు ఎదుట హాజరైయ్యారు.
కాగా ఈ విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం.మరోవైపు పద్మనాభంపై గత ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆయన తరపు న్యాయవాది మన్మధరావు తెలిపారు.
టీడీపీ నుంచి బయటకు వచ్చారనే కారణంగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?