బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు అరెస్ట్..!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ గ్యాంగ్ వార్ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా, ఇప్పటివరకు ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 54 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరికొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.

ఇక పరారీలో ఉన్న మరికొంత మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అధికారులు గాలిస్తున్నారు.

నిందితులపై రౌడీ షీట్లు తెరవనున్నారు.కాగా, వీరిలో నేర చరిత్ర ఎక్కువగా ఉన్న వారిని నగర బహిష్కరణ చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది మే 30న విజయవాడ నడిబొడ్డున సందీప్, పండుకు చెందిన రెండు గ్యాంగ్‎లు పరస్పరం దాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

ఈ ఘటనలో సందీప్ మృతి చెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పోలీసులు.నగరంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

మరోవైపు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!