రెండు సార్లు స్టార్ హీరోలకు చుక్కలు చూపించింది ..అందుకే లేడి అమితాబ్ అయ్యింది
TeluguStop.com

విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.తెలుగు సినిమా రంగంలో తనో మకుటం లేని మహరాణి.


హీరోలకు సాధ్యం కాని ఎన్నో ఘనతలను తాను సాధించింది.స్టార్ హీరోలకు మించి సినిమాలు చేసింది.


వారి సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈమె సినిమాలు వసూళ్లను సాధించాయి.టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు గడించిన విజయశాంతి.
టాప్ హీరోలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.1985తో పాటు 1997 లో రెండు సార్లు టాప్ హీరోల సినిమాలను కాదని.
ఆమె సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1985లో కృష్ణ హీరోగా అగ్ని పర్వతం, వజ్రాయుధం అనే సినిమాలు విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి.అదే ఏడాది చిరంజీవి అడవి దొంగ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.
ఇది కూడా బంపర్ హిట్ అయ్యింది.అదే ఏడాది విజయశాంతి నటించిన ప్రతి ఘటన సినిమా వచ్చింది.
ఈ సినిమా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇదొక్కటే కాదు.1997 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా విడుదల అయ్యింది.
మాస్టర్ కూడా వచ్చింది.నాగార్జున నటించిన అన్నమయ్య రిలీజ్ అయ్యింది.
బాలకృష్ణ హీరోగా చేసిన పెద్దన్నయ్య, వెంకటేష్ హీరోగా చేసిన చిత్రం ప్రేమించుకుందాం రా సూపర్ హిట్లుగా నిలిచాయి.
"""/"/
అదే ఏడాది విడుదల అయిన ఒసేయ్ రాములమ్మ సినిమా సంచలన విజయం సాధించింది.
ఈసినిమా 12.5 కోట్ల రూపాయయలు వసూలు చేసింది.
అంతే కాదు టాప్ హీరోలను కాదని.అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్టు క్రియేట్ చేసింది.
నాటి టాప్ హీరోలకు తాను ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలు చేసింది విజయశాంతి.
తెలుగు ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని ఆమె సంపాదించుకుంది.తెలుగు పరిశ్రమలో తన కంటూ ఓ ప్రత్యేకత పొందింది.
విక్రమార్కుడు సినిమాలో రవితేజ డూప్ ప్రస్తుతం ప్రాణాలతో లేరా..?