గ్యాంగ్ లీడర్ విషయంలో విజయశాంతి మాటలు వక్రీకరించింది ఎవరు?

విజయశాంతి.తెలుగు సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా.

లేడీ అమితాబ్ గా పేరు సంపాదించిన నటీమణి.అంతకు ముందు ఏ హీరోయిన్ చేయని సాహసాలన్నీ విజయశాంతి సినిమాల్లో చేసింది.

అంతేకాదు.స్టార్ హీరోలకు మించి ప్రజాదరణ పొందింది.

వారికి మించి తన సినిమాలతో జనాల్లో ప్రభంజనం సాధించింది.ఇంకా చెప్పాలంటే వారికి మించిన హిట్లతో ఇండస్ట్రీలో సంచలనాలు నమోదు చేసింది.

ప్ర‌తిఘ‌ట‌న‌, ఒసేయ్ రాముల‌మ్మా, క‌ర్త‌వ్యం లాంటి సూపర్ డూపర్ హిట్లతో స్టార్ హీరోలకే ముచ్చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ.

నేటి భార‌తం, ప‌డ‌మ‌టి సంధ్యారాగం, మొండిమొగుడు పెంకిపెళ్లాం, పోలీస్ లాక‌ప్‌, స్వ‌యంకృషి, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాలతో హీరోయిన్ గా ఓ రేంజిలోకి వెళ్లిపోయింది.

ఈ సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించినట్లు చెప్పింది.పలువురు టాప్ హీరోలతో నటించిన సినిమాల్లోనూ తనకు అద్భుత క్యారెక్టర్లు చేసే అవకాశం కలిగిందని వెల్లడించింది.

గ్యాంగ్ లీడర్ సినిమాలో తన పాత్రకు అద్భుత ప్రశంసలు దక్కినట్ల చెప్పింది. """/"/ గ్యాంగ్ లీడర్ సినిమాలో తన పాత్ర అరేబియ‌న్ గుర్రంలా పరిగెడుతూనే ఉందని వెల్లడించింది.

దర్శకుడు విజయబాపినీడు.తన పాత్రను కొంత డిజైన్ చేస్తే.

మిగతా సగం తానే డిజైన్ చేసినట్లు వెల్లడించింది.అంతేకాదు.

అప్పట్లో తన క్యారెక్టర్ మూలంగానే ఈ సినిమా హిట్ అయ్యిందని విజయశాంతి అన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.

కానీ.అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని ఆమె వెల్లడించింది.

అదెవరో తానంటే నచ్చని వారు చేసిన ప్రచారంగా ఆమె కొట్టిపారేశారు.నేను అలా అని ఉంటే మళ్లీ చిరంజీవితో కలిసి సినిమా చేసేదాన్ని కాదని చెప్పింది.

కానీ గ్యాంగ్ లీడర్ తర్వాత ఇద్దరం కలిసి మెకానిక్ అల్లుడు చేసినట్లు వెల్లడించింది.

ఆ సినిమా గురించి ఓసారి మాట్లాడుతూ.గ్యాంగ్ లీడర్ సినిమాలో తన పాత్ర చిరంజీవితో సమానంగా ఉంటుందని చెప్పింది.

తనతో పోల్చితే నాదే డ్యామినేటింగ్ క్యారెక్టర్ అన్నది.దానికి చిరంజీవి కూడా బాగా సపోర్ట్ చేసినట్లు వెల్లడించింది.

అన్నను నిర్మాతగా నిలబెడుతున్న ఎన్టీఆర్.. భారీ లాభాలను అందిస్తున్నాడుగా!