వైసీపీ ఎంపీకి షాకిచ్చిన 104 నిర్వాహకులు.. సీఎం జగన్ ఆదేశాలు బేఖాతరు.. ?

ఏపీ ప్రజల విషయంలో సీయం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా కోవిడ్ సమయంలో మాత్రం ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు వ్యవహరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తోన్న నేపధ్యంలో 104 కాల్ సెంటర్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.

అయితే సీయం ఆదేశాలు ఎంతవరకు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 104 సర్వీసు కేంద్రానికి స్వయంగా ఫోన్ చేశారు.

కానీ సుమారుగా 20 నిమిషాల వరకు ఎవరు స్పందించక పోవడంతో అసహనానికి గురైన విజయసాయి రెడ్డి 104 నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ఎంపీ స్దాయిలో ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే అప్రమత్తం అయిన 104 నిర్వాహకులు సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నిజానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో త్వరగా పరిష్కరించాలి.ఇక ఇదే కాల్ ప్రాణాలతో పోరాడుతున్న వారు చేసి ఉంటే పరిస్దితి ఏంటన్నది ఊహకందని విషయం.

ఏది ఏమైన సాక్షాత్తు ఏపీ సీయం ఆదేశాలిచ్చిన ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని నేరం.

ఉక్రెయిన్‌లోని ప్రముఖ హ్యారీ పోటర్ కోట నాశనం.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..?