టీడీపీకీ నిద్ర పట్టడం లేదంటూ విజయసాయిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP )లో వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ.అధికారం చేజారి పోకుండా జాగ్రత్తలు పడుతూ ఉంది.

ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్( CM YS Jagan ).

వైసీపీ నేతలను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మరోపక్క ప్రతిపక్షాలు వైసీపీనీ ఎలాగైనా గద్దె దించాలని ప్రజా పోరాటాలతో పాటు పొత్తులకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( YCP MP Vijayasai Reddy ) టీడీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

"""/"/ నరసరావుపేట( Narasaraopeta )లో మీడియాతో మాట్లాడుతూ.వచ్చే ఎన్నికలలో 25కి 24 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవబోతుందని జాతీయ సర్వేలు చెబుతూ ఉండటంతో టీడీపీ.

ఎల్లో బ్యాచ్ కి నిద్ర పట్టడం లేదని అన్నారు.టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తుందని చంద్రాయన్ స్పీడ్ తో చంద్రబాబు వెళ్తున్నారని.

పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తుందన్నారు.ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్లుగా చంద్రయాన్ విజయం( Chandrayaan ) పై తెలుగుదేశం పార్టీ హడావిడి చేస్తుందని విమర్శ చేశారు.

లోకేష్ ఇంకా చంద్రబాబు గెలిస్తే తంతాం.బట్టలూడదీస్తాం .

అని అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారని అన్నారు.టీడీపీ( TDP )లో అందరూ సంఘవిద్రోహశక్తులే.

ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు.అని మండిపడ్డారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) కుప్పంలో ఇల్లు కట్టించుకుంటున్నా వార్డులో వైసీపీ గెలిచిందని స్పష్టం చేశారు.

సీఎంనే అయ్యన్న అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.అయ్యన్నపాత్రుడు కాదు.

అరగుండు పాత్రుడు అంటూ ఎద్దేవా చేశారు.పల్నాడులో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని.

గెలవబోతున్నామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో అతనేనా.. చరణ్, బన్నీ, తారక్ లలో ఎవరంటే?