175 స్థానాలు ఉంటే 225 స్థానాలలో గెలుస్తారా... నోరు జారిన విజయసాయిరెడ్డి

ఏపీలో రాజధాని రగడ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది.ఏపీని నాలుగు డివిజన్ లుగా విభజించి, మూడు రాజధానులు చేయడంపై ఆయా ప్రాంతాలలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ప్రస్తుత రాజధాని ప్రాంతమైన గుంటూరు, అమరావతి ప్రాంతంలో ప్రజలు, రైతుల నుంచి మాత్రం నిరసన వ్యక్తం అవుతుంది.

అయితే ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతున్న అధికార పార్టీ మాత్రం పెద్దగా లెక్కచేయడం లేదు.

అదంతా టీడీపీ కార్యకర్తల ఆందోళన అని విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ రోజు ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో పర్యటిస్తూ అక్కడ జగన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో తన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అయ్యాయి.

ట్విట్టర్‌లో యాక్టివ్ గా ఉండే విజయసాయి రెడ్డి విపక్షాల మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఎక్కువగా జనసేనపైన, పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ లతో విమర్శలు దాడి చేస్తూ ఉంటారు.

అయితే వాటిని జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.తాజాగా ఏపీ అసెంబ్లీ సీట్ల గురించి కాస్తా టంగ్ స్లిప్ అయ్యారు.

వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈసారి 151 సీట్లు ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీని 225 స్థానాలకుగానూ 224 స్థానాల్లో గెలిపించి భారీ మెజారిటీ ఇవ్వాలి అని నోరు జారారు.

ఈ మాటలు ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఇరుకున పెట్టాయి.సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అయ్యాయి.

ఏపీ అసెంబ్లీ లో 175 స్థానాలు ఉంటే 225 స్థానాలలో ఎలా గెలుస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకరేమో బైక్స్ టోల్ కట్టుకోరనే విషయం తెలియదు.మరోకరికేమో ఏపీ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలియదు.

వీళ్ళు మన నాయకులు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.