ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్..!!

నిన్న ఢిల్లీలో టీడీపీ యువనేత నారా లోకేష్( Nara Lokesh ).కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో( Amit Shah ) భేటీ కావడం తెలిసిందే.

ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని చర్చించడం జరిగింది.లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ట్విట్టర్ లో పురంధేశ్వరి పై సంచలన పోస్ట్ పెట్టారు.

"జాతీయ పార్టీ అయిన బీజేపీని 'బావ' సారూప్య పార్టీగా మార్చిన రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరి గారు! అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరవాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్థించి, రిమాండ్‌ విధించింది.

బాబు అరెస్టు, రిమాండ్‌ సరికాదన్న వాదనల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి.

సుప్రీం కోర్టు సీనియర్‌ అడ్వకేట్‌లు– సిద్ధార్థ్‌ లూధ్రా, హరీష్‌ సాల్వే ( Siddharth Ludra, Harish Salve )బాబు కోసం చేసిన వాదనల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి కాబట్టి.

'బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌' అన్న విధంగా మీ మరిది కోసం మీరు రంగంలోకి దిగారు.

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని మీరే అబద్ధం చెపుతూ, లోకేశ్‌ని వెంటబెట్టుకుని బాబు తరఫున మధ్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గారిని కలిశారు.

ఇంతకీ మీరు టీడీపీలో ఉన్నారా? లేక బీజేపీలో ఉన్నారా? మీరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలో ఉన్నానని అంటున్నా– మీ టాప్‌ ప్రయారిటీ మీ అవినీతి మరిదికి శిక్ష పడకుండా కాపాడుకోవటమే అని బాగా నిరూపిస్తున్నారు!" అనీ విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

వీడియో వైరల్: బంగారం షాపులో తెగబడ్డ దొంగలు.. వ్యక్తి మృతి..