నిర్దోషులైతే దర్యాప్తు ఎదుర్కొండి విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్..!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu Arrest )ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే.
దాదాపు రెండు వారాలకి పైగా సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉంటూ ఉన్నారు.ఈ క్రమంలో బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం నేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
మరోపక్క సీఐడీ పలు కేసులకు సంబంధించి విచారణ చేపడతానికి రెడీగా అవుతోంది.ఈ క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) నాయకులకు సంచలన సవాల్ విసిరారు.
"చంద్రబాబు గారు, ఆయన కుమారుడి దోపిడీలో భాగస్వాములైన మాజీ మంత్రులు, మాజీ అధికారులు, బినామీల ముందస్తు బెయిళ్లు, స్క్వాష్ పిటిషన్లతో ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు కోర్టుల సమయాన్ని హరిస్తున్నారు.
మీరు నిజంగా నిర్దోషులైతే దర్యాప్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడొచ్చు కదా" అని విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )పోస్ట్ పెట్టడం జరిగింది.
ఇప్పటికే చంద్రబాబుకి బెయిల్ విషయంలో ఏసీబీ న్యాయస్థానంతో పాటు హైకోర్టులో తెలుగుదేశం నేతలు పోరాడారు.
అయినా బెయిల్ రాలేదు.ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఆ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసిందా…. ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా?