నెల్లూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి..!!

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి( TDP Candidate Vemireddy ) నామినేషన్ అంశంపై ఫిర్యాదు చేశారు.

అయితే తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి తిరస్కరించారని విజయసాయి రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్తామని చెప్పారు.

"""/" / విదేశాల్లో ఉన్న పెట్టుబడులు, ఆస్తులను అఫిడవిట్ లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పేర్కొనలేదని తెలిపారు.

దేశంలో ఉన్న ఆస్తుల్లో కొన్నింటిని పొందుపరచలేదన్నారు.వివిధ కంపెనీల్లో ఉన్న షేర్లనూ వేమిరెడ్డి పొందుపరచలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లీగల్ గా ముందుకు వెళ్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ఇన్ని హిట్ సినిమాలు రిలీజవుతున్నాయా?