ప్రాణ హాని ఉందని చెప్పినా నన్ను హాస్పిటల్ నుంచి పంపించేశారంటూ నటి…

తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించిన "హనుమాన్ జంక్షన్" చిత్రంలో నటించిన నటి విజయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే నటి విజయ లక్ష్మి తనని సీమన్ అనే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో సహజీవనం కూడా చేసి చివరికి పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇటీవలే తాను పలు అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆసుపత్రిలో చేరిన కూడా ఆ వ్యక్తి తన అధికార పలుకుబడిని ఉపయోగించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే విధంగా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాగే తన ఆరోగ్యం ఇంకా కుదుటపడక ముందే ఆసుపత్రి యాజమాన్యం తనని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిందని ఎమోషనల్ అయ్యింది.

అంతేకాక సీమన్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయని కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

 అంతేకాక ఈ విషయం గురించి స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుత కాలంలో ప్రేమ పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే  ప్రక్రియలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి విజయలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ తదితర భాషలలో 20 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అలాగే అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే "సూర్యవంశం" అనే సీరియల్ లో కూడా నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి చేతిలో కొద్దిగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటుంది.

తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్