సూర్యాపేట జిల్లా:విజయాలకు ప్రతిబింబింగా జరుపుకునే విజయదశమి స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రగతికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేశాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం ఆవశ్యకత ఉందని తెలిపారు.