Vijayashanthi: అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కళ్యాణ్ రామ్.. విజయశాంతి చేసిన ట్వీట్ కు గూస్ బంప్స్ రావాల్సిందే!
TeluguStop.com
ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి విజయశాంతి (Vijaya Shanthi)ఒకరు.
ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో గొప్ప పురస్కారాలు కూడా అందుకున్నారు.
ఇలా హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి విజయశాంతి అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె రాజకీయాలలో బిజీగా మారిపోయారు.
ఇలా రాజకీయాల పరంగా బిజీగా ఉన్నటువంటి విజయశాంతి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.
విజయశాంతి ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు మంచి కథ నేపథ్యం ఉన్న సినిమాలు వస్తే నటించడానికి ముందుకు వస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే ఈమె మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru)సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే ఈ పాత్రలో నటించిన విజయశాంతికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఇక ఈ సినిమా తర్వాత ఈమె తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటిస్తున్నటువంటి తన 21వ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా NKR21 టైటిల్ తో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా విజయశాంతి కూడా పాల్గొన్నారు.
"""/" /
ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం విజయశాంతి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.
ఈమె సోషల్ మీడియా వేదికగా నందమూరి తారకరామారావు గారితో( Nandamuri Taraka Ramarao ) కలిసి దిగినటువంటి ఫోటోతో పాటు కళ్యాణ్ రామ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ.ఆనాడు లెజెండ్ ఎన్టీఆర్ గారు 30 సంవత్సరాల ముందు ఒక సినిమా ప్రారంభం నాడు నాకు ఇచ్చిన గౌరవం, అట్లే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా ముహూర్తం రోజు నాకు ఇచ్చిన గౌరవం.
ఎప్పుడూ కూడా కళాకారిణిగా నాకు ప్రోత్సాహం, ప్రేరణ కల్పించే సందర్భాలే అంటూ ఈమె చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా