బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించారు అడ్డు విజయ సాయి రెడ్డి ఫైర్..!!
TeluguStop.com
బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.
బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ.రాష్ట్రానికి పూర్తిగా మొండిచేయి చూపించిన బడ్జెట్ అని పేర్కొన్నారు.
బడ్జెట్లో అసలు రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవని అన్నారు.కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు రాష్ట్రంపై ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు.
దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైనే ప్రేమ చూపిస్తూ మిగతా వారికి మొండి చేయి చూపించటం దారుణం అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని విజయసాయి వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు.
రాష్ట్రానికి సంబంధించి మెట్రోరైల్ విషయంలో ప్రభుత్వాలు ఆరు సంవత్సరాల నుండి కేంద్రాన్ని కోరుతున్నాం విజ్ఞప్తులను పక్కన పెట్టడం దారుణమని అన్నారు.
అదే విధంగా కొత్త టెక్స్‌టైల్ పార్క్, పోలవరం విషయంలో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
గుండెలు గుభేల్: మహాకుంభమేళాలో 100 అడుగుల పాము ప్రత్యక్షం.. వైరల్ వీడియోలో ట్విస్ట్!