‘అయ్యో పాపం ‘ అంటూనే బాబుపై విజయసాయి కౌంటర్లు ! 

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పై ఎప్పుడూ ఏదో ఒక.

విమర్శ చేస్తూ, మీడియా, సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేస్తూ ఉంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి.

  తాజాగా మరోసారి చంద్రబాబును టార్గెట్ చేసుకుని సెటైర్లు వేశారు.అయ్యో పాపం ఎన్ని లాబింగులు చేసినా, ఎన్డీఏ కూటమి సమావేశానికి టిడిపికి ఆహ్వానం రాలేదు.

బిజెపిలోకి పంపించిన కోవర్ట్ లు శతవిధాల ప్రయత్నించి భంగపడ్డారు .తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో కుమిలి పోతున్నాడు బాబు గారు.

అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు అంటూ విజయ సాయి ట్విట్టర్ ద్వారా విమర్శించారు.

  ఇక మరో పోస్ట్ లో జగన్ గారి నాలుగేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు.

నిధులు పక్కదోవ పట్టిన ఉదాంతం లేదు.రైతులు ఎన్నడూ లేనంత ధీమాగా మహిళలు , యువత విద్యార్థులు, వృద్ధులు ఆసరా లేని వారంతా ఇటువంటి సీఎం ఎప్పటికీ ఉండాలని గుండె నిబ్బరంతో ఉన్నారు.

"""/" / స్పేస్ లేకున్నా ఏదో ఒకటి కెలకాలని టిడిపి ( TDP )వారు వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.

ప్రతిపక్షం ప్రజల కోసం .ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఉద్యమిస్తాయి.

నిబద్ధతతో నిలబడే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారు.ఆంధ్ర టిడిపిలో మాత్రం విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది.

ఒక విఫల నేత కోసం అంత పోగవుతారు.ఆయన ఊ  అనగానే ఉత్తుత్తి ఉద్యమాలు,  హాస్యాస్పద ప్రదర్శనలు జరుగుతుంటాయి అంటూ విజయ సాయి మరో ట్విట్ చేశారు.

ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం నందమూరి తారకరత్న మృతి చెందిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబుతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలిగారు.

"""/" /  ఆ సమయంలో విజయసాయిరెడ్డి( Vijayasaireddy ) వైఖరిలో మార్పు వచ్చిందని, ఇకపై చంద్రబాబుపై ఆయన ఎటువంటి విమర్శలు చేసే అవకాశం లేదనే ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్లు గానే మీడియా,  సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి హడావుడి కనిపించలేదు.అయితే గత కొద్దిరోజులుగా ఆయన మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ చంద్రబాబు,  లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండడంతో విజయసాయి మళ్లీ యాక్టిివ్ అయ్యారనే విషయం అర్థం అవుతోంది.

ఆ తేదీన విడుదల కానున్న చైతన్య తండేల్.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!