దిల్ రాజు వారసుడు వాయిదా పుకార్లు.. అసలు ఏం జరుగుతోంది?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సమయం లో జనవరి 11వ తారీఖున వారసుడు తెలుగు వర్షన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకు కారణం జనవరి 10వ తారీఖున విదేశాల్లో మరియు ఇండియాలో స్పెషల్ ప్రీమియర్ షో లకు అనుమతులు రాలేదు.

ఇప్పటి వరకు ప్రీమియర్ షో అనుమతులు రాక పోవడంతో వారసుడు సినిమా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వారసుడు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది.ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దగా చేయలేదు.

అలాగే నాన్ థియెట్రికల్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో చేయలేక పోయింది.సినిమా సక్సెస్ అయితే తప్పితే దిల్ రాజు బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకోలేదు.

ఇలాంటి సమయం లో ప్రమోషనల్ ఈవెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి.అంతే కాకుండా ముందస్తుగా పర్మిషన్లు తీసుకొని ప్రీమియర్ షోలకు వెళ్లాలి.

మొత్తానికి దిల్ రాజు ఆ విషయంలో విఫలమయ్యాడు అనిపిస్తుంది.నేడు లేదా రేపు """/"/వారసుడు తెలుగు వర్షన్ విడుదల ఉందా లేదా వాయిదా పడితే ఎప్పుడూ మళ్లీ సినిమా వస్తుంది అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక తమిళ్ వర్షన్ పరిస్థితికి వస్తే ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందని అక్కడ అభిమానులు వారసుడు సినిమా విడుదల కాకపోతే రచ్చ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తెలుగు లో వారసుడు సినిమాకు బజ్ లేదు అంటూ ఉన్న సమయంలో ఇలా వాయిదా వార్తలు ఆ సినిమా కు మరింత డ్యామేజీని కలిగిస్తాయి అంటున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters