దళపతి మళ్ళీ డ్యూయెల్ రోల్.. మొత్తంగా ఎన్నిసార్లు చేసారంటే?
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు తమిళనాట ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయనకంటూ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.ముఖ్యంగా ద్విపాత్రాభినయం చేసి ఆడియెన్స్ ను అలరించాడు.
ఇప్పటికే 5 సినిమాల్లో డ్యూయెల్ రోల్స్ తో విజయ్ మెప్పించాడు.ఇక ఇప్పుడు 6వ సారి కూడా డ్యూయెల్ రోల్ లో నటించ బోతున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తుంది.
విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ''లియో'' ( Leo Movie )సినిమా చేస్తున్నాడు.
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లోనే రికార్డ్ బిజినెస్ చేస్తుంది.మరి రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.
"""/" /
ఇదిలా ఉండగా విజయ్ ఈ సినిమా పూర్తి అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ సినిమాను డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు.
ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. """/" /
ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తమిళ్ మీడియా చెబుతుంది.
ఇప్పటికే 5 సినిమాల్లో చేసిన విజయ్ 6వ సినిమాలో కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇదే నిజమైతే ఈ సినిమా కూడా మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయం.ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నట్టు హీరోయిన్ గా జ్యోతికను తీసుకుంటున్నట్టు టాక్స్ వచ్చాయి.
అలాగే టి సిరీస్ సంస్థ ఆడియో హక్కులను భారీ మొత్తం పెట్టి దక్కించుకున్నట్టు వార్తలు రకరకాలుగా షికార్లు చేస్తున్నాడు.
ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ప్రస్తుతానికి మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?