'వరిసు' ఫస్ట్ సింగిల్ పై టెన్షన్.. బ్లాస్టింగ్ కోసం ఫ్యాన్స్ వైటింగ్!
TeluguStop.com
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి తమిళ్ సూపర్ స్టార్ అయినా కూడా ఈయనకు తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.
సూపర్ స్టార్ గా ఎదిగి తమిళ్ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఈ స్టార్ అక్కడ రజనీకాంత్ తర్వాత స్థానం అందుకుని ఫాలోయింగ్ లో మిగతా హీరోలను వెనక్కి నెట్టాడు.
ఇక తెలుగులో ఈయన సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేస్తూనే ఉన్నారు.కానీ ఇప్పుడు డైరెక్ట్ సినిమాతో వచ్చి ఇక్కడ మార్కెట్ మరింత పెంచుకోవాలని ఆశ పడుతున్నాడు.
తెలుగులో మార్కెట్ కోసం తమిళ్ డైరెక్టర్ లను పక్కన పెట్టి మరీ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.
ప్రెజెంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.తమిళ్ లో 'వరిసు' తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ బైలింగ్వన్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని విజయ్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
కానీ ఎటువంటి అప్డేట్ రావడం లేదు.అయితే ఈ సినిమా నుండి దీపావళి పండుగ కానుకగా అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నట్టు.
అది కూడా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ను రెడీ చేస్తున్నట్టు థమన్ కూడా కన్ఫర్మ్ చేసాడు.
దీంతో ఈ పండుగ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.అయితే ఇప్పుడు కోలీవుడ్ మీడియా మాత్రం మరో మాట చెబుతుంది.
దీనిపై లేటెస్ట్ టాక్ ఒకటి తమిళ సినీ వర్గాల నుండి వినిపిస్తుంది. """/"/
.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా వస్తుంది అనుకుంటే ఇప్పుడు అది రాకపోవచ్చని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది.
అయితే దీనికి మించిన పెద్ద ట్రీట్ ను మేకర్స్ రెడీ చేస్తున్నారని అంటున్నారు.
చూడాలి మరీ ఈ అప్డేట్ ఉంటుందో లేదో.ఇక దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
వీడియో వైరల్.. వృద్ధ మామను తోసేసిన బీజేపీ నాయకురాలు