'దళపతి 68'పై లేటెస్ట్ బజ్.. డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ అతడేనట!
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు.ఈయన తిరుగులేని స్టార్ డమ్ తో కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు.
ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ''వారసుడు'' సినిమా చేస్తున్నాడు.తమిళ్ లో 'వరిసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా.
రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈయన భారీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ఈయన కెరీర్ లో 67వ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా వారసుడు రిలీజ్ కాగానే వెంటనే స్టార్ట్ చేయబోతున్నారు.
"""/"/ ఇటీవలే 'విక్రమ్' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ విజయ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమా ఇలా ఉండగానే ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమా కూడా ఫిక్స్ అయ్యింది అంటూ కోలీవుడ్ లో వరుస కథనాలు వస్తున్నాయి.
కోలీవుడ్ మీడియా చెబుతున్న కథనాల ప్రకారం.విజయ్ నెక్స్ట్ 68వ సినిమాను కోలీవుడ్ సంచలనాత్మక కమర్షియల్ డైరెక్టర్ అట్లీ తో చేయబోతున్నాడు అనేది సారాంశం.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీగా నిర్మించ నుండగా.అనిరుద్ సంగీతం అందించనున్నాడట.
అట్లీతో సినిమా అనే రూమర్స్ ఇప్పుడు విజయ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతుంది.