పాన్ కార్డుకు సంబంధించి ఈ మార్పులు చేయండి.. విజయ్ సేతుపతి విజ్ఞప్తి వైరల్!
TeluguStop.com
కోలీవుడ్, టాలీవుడ్,( Kollywood, Tollywood ) ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )కూడా ఒకరు.
సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న విజయ్ సేతుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎంతో కీలకమైన పాన్ కార్డ్ విషయంలో కొన్ని మార్పులు చేయాలని కోరడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వానికి విజయ్ సేతుపతి చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
ఒక ఈవెంట్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పాన్ కార్డ్ కు ( PAN Card )సంబంధించిన వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ విధంగా చేయడం వల్ల ఈ భాషలు రాని వాళ్లు పాన్ కార్డ్ అప్ డేట్ల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
"""/" /
పాన్ కార్డుకు సంబంధించి తమిళ భాషను యాడ్ చేయడం సులువు కాదని అయినప్పటికీ యాడ్ చేయడానికి ప్రయత్నించాలని ఆయన కామెంట్లు చేశారు.
పాన్ కార్డ్ వెబ్ సైట్ లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే అది మరింత ఎక్కువమందికి చేరుతుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.
తమిళనాడు ( Tamil Nadu )రాష్ట్రంలోని ప్రజలకు పాన్ కార్డ్ విషయంలో సమస్యలు ఎదురైన సమయంలో వారికి అర్థమయ్యే భాషలో సమాచారం ఉంటే వారు గందరగోళానికి గురి కారని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
"""/" /
విజయ్ సేతుపతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ సేతుపతి పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది.విజయ్ సేతుపతి తర్వాత సినిమాలతో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.
విజయ్ సేతుపతి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఆ పత్రిక ముఖచిత్రంగా బన్నీ ఫోటో.. ఐకాన్ స్టార్ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్!