పుష్ప నుంచి తప్పుకోవడానికి ఆ ఒక్కటే కారణం అంటున్న విజయ్ సేతుపతి

రంగస్థలం తర్వాత దర్శకుడు సుకుమార్ మరోసారి అదే జోనర్లో మాస్ కథాంశాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.

చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కబోతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

దీంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమాలో నటించడానికి ముందు ఓకే చెప్పి తర్వాత చేయలేనని తప్పుకున్నాడు.

దీనిపై టాలీవుడ్ లో చాలా కారణాలు వినిపించాయి.తమిళనాడుకు చెందిన గంధపు చెక్కల స్మగ్లర్ గా ఇందులో విలన్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో నటిస్తే తమిళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే మీడియాలో వినిపిస్తున్నట్లు ఇలాంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తాజాగా విజయ్ సేతుపతి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

పుష్ప సినిమా చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ సినిమా డేట్స్ అడిగిన సమయంలో తనకు ఇతర సినిమాలు కమిట్మెంట్ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు.

కేవలం డేట్స్ సర్దుబాటు చేయలేక మాత్రమే సినిమా వదులుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.దీంతో పుష్పా సినిమాలో విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఎన్ని రోజులు జరిగిన ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లు అయింది.

తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా… ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!