కమల్ హాసన్ సూపర్ హిట్ సాంగ్ లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి!
TeluguStop.com
1988 డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్, అమల జంటగా నటించినటువంటి చిత్రం సత్య ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాలోని వళయోసై గలగలవెన.(గాజుల సవ్వడి గలగలమంటూ.
) అనే పాట అప్పట్లో ఎంతో పేరు సంపాదించుకుంది.ఈ మధ్యకాలంలో తెరకెక్కే సినిమాలో పాత సినిమాల్లోని పాటలను రీ క్రియేట్ చేసి వాడటం మనం చూస్తూనే ఉన్నాము.
ఈ విధంగా సత్యసినిమాలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాటను తాజాగా నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా కోసం ఆ పాటను దర్శకుడు విగ్నేష్ రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
"""/"/
సత్య సినిమాలో హీరోయిన్ గా నటించినటువంటి అమల ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం విశేషం.
ఇకపోతే అప్పట్లో ఈ సినిమాలో తెలుపు రంగు చీర కట్టుకొని అమల కమల్ హాసన్ సరసన ఆడిపాడగా, ఈ వెర్షన్ లో విజయ్ సేతుపతి సరసన నయనతార, సమంత అలాంటి తెలుపు రంగు చీర కట్టుకొని నటించడం విశేషం.
అదేవిధంగా సత్య సినిమాలో ఈ పాటలో హీరో హీరోయిన్స్ ఇద్దరు బస్సు ప్రయాణం చేస్తూ ఫుట్ బోర్డు పై నిలబడినటువంటి సన్నివేశాలను ఈ వెర్షన్ లో కూడా దర్శకుడు విగ్నేష్ తెరకెక్కించారు.
అప్పట్లో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ పాట మరి ఈ సినిమాలో ఏవిధంగా శ్రోతలను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
బాలయ్య రేంజ్ ఇంతలా పెరిగిందా.. అన్ని వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారా?