ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఆస్తుల లెక్కలివే.. వామ్మో అంత సంపాదించారా?
TeluguStop.com
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి(vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
సినిమాల్లో రాణించాలి అన్న కలతో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి(vijay Sethupathi) చిన్న చిన్నగా నటిస్తూనే నేడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు.
ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా తెన్మేర్కు పరువక్కాట్రు.సీను రామసామి(Seenu Ramasamy) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది విజయ్.ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ సేతుపతి.
హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. """/" /
తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ(Tamil, Telugu, Hindi, Malayalam) సినిమాల్లో కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్.
తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించిన విజయ్ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జవాన్(Shahrukh Khan ,Jawan) సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) షోకి హోస్ట్ గా వ్యవహరించారు.
కమల్ హాసన్ (Kamal Haasan)7 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించగా, 8వ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించారు.
"""/" /
అయితే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట విజయ్ సేతుపతి.
సినిమాల్లో హీరోగా నటించడానికి 30 కోట్లు తీసుకుంటారు.బిగ్ బాస్ కి మాత్రం డబుల్ తీసుకున్నారట.
విజయ్ సేతుపతి ఇప్పటివరకు 50 సినిమాల్లో నటించారు.ఆయన ఆస్తుల విలువ 140 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.
ఇక చెన్నైలో 50 కోట్ల విలువైన బంగ్లా ఉంది.విజయ్ సేతుపతి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారు.
చెన్నైలో, ఎన్నూర్ లలో 100 ఎకరాలకు పైగా స్థలాలు ఉన్నాయని సమాచారం.మిని కూపర్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, ఇన్నోవా, బెంజ్ (Mini Cooper, BMW 7 Series, Innova, Benz)వంటి కార్లు కలిగి ఉన్నారు విజయ్ సేతుపతి.
వీటితోపాటుగా ఇంకా చాలా ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
వీడియో వైరల్.. భార్యతో కలిసి రెచ్చిపోయిన ట్రంప్