ముగ్గురు చెల్లెల్ల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ప్రేక్షకుల ఆదరణ పొంది స్టార్ హీరోగా మారిన వారి గురించి మాట్లాడితే.

ఈ లిస్టులో విజయ్ సేతుపతి పేరు కూడా వస్తుంది అన్న విషయం తెలిసిందే.

చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలు పెట్టిన విజయ్ సేతుపతి ఇక ఇప్పుడు తమిళ ప్రేక్షకులు అందరికి కూడా మక్కాల్ సెల్వన్ గా కొనసాగుతున్నాడు.

తన నటనతో తనని తాను ఎప్పుడూ కొత్తగా చూపించుకుంటూ జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ సేతుపతి.

ఇలా స్టార్ హీరోగా ఎదిగాడు అని మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ.ఇందుకోసం విజయ్ సేతుపతి కెరియర్లో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు అని చెప్పాలి.

విజయ్ సేతుపతి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.మధ్య తరగతి కుటుంబంలో పుడితే బాధ్యతలు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక అంతే కాదండోయ్ విజయ్ సేతుపతి కి ముగ్గురు చెల్లెలు.ఇంకేముంది వారికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉండిపోయింది.

దీంతో ఇక పనికోసం నేరుగా దుబాయ్ వెళ్లిన విజయ్ సేతుపతి అక్కడ ఒక కంపెనీ లో అకౌంటెంట్ గా పనిచేశాడు.

మూడేళ్లు అక్కడే పని చేసి మరొక పని కోసం ఇండియాకు వచ్చాడట. """/" / ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో విజయ్ సేతుపతి స్నేహితులు ఇంటీరియల్ వ్యాపారం మొదలు పెట్టారట.

ఇలాంటి సమయంలోనే విజయ్ సేతుపతి మార్కెటింగ్ కంపెనీలో చేరి ఇక ఇంటి పోషణ చూసుకోవడం మొదలుపెట్టారు.

అలాంటి సమయంలో దర్శకుడు బాలూ మహేంద్ర తో విజయ్ సేతుపతి కి పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి లో నటన టాలెంట్ ఉందని భావించిన బాలు మహేంద్ర షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇచ్చారు.

ఇక ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.చిన్నచిన్న పాత్రలు ఆయన తలపు తడుతూ వుండేవి.

విజయ్ సేతుపతి కెరీర్లో మొదటి ప్రధాన పాత్ర రామ స్వామి కథ చిత్రం నాటకంలోనిది.

అందులో గొర్రెలకాపరి పాత్ర పోషించగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా దక్కించుకున్నాడు.

ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి.

వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ?