బాలయ్య సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పిన విలన్.. ఎవరంటే?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య తన తర్వాత సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి."ఎన్‌బీకే107" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే గోపీచంద్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడం కోసం హీరోయిన్ ను, బాలయ్యతో పోటీపడటం కోసం విలన్ ను వెతికే పనిలో పడ్డారు.
"""/"/
ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీపడటం కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది.
"ఉప్పెన" సినిమా ద్వారా విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న విజయ్ సేతుపతిని బాలకృష్ణ సినిమాలో నటించడం కోసం దర్శకుడు గోపీచంద్ విజయ్ సేతుపతి సంప్రదించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించడం కోసం విజయ్ సేతుపతి నో చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం.
"""/"/
ఈ విధంగా విజయ్ సేతుపతి బాలయ్య సినిమాను తిరస్కరించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి పలు సినిమాలతో బిజీగా ఉండటం చేత ఈ సినిమాకు చెప్పాడా? లేక మరే ఇతర కారణాల వల్ల ఈ సినిమాను తిరస్కరించాడ అనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి హీరోయిన్ శృతి హాసన్ ను సంప్రదిస్తే ఆమె కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తానికి స్టార్స్ సెలబ్రిటీలతో బాలకృష్ణ 107 వ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించిన దర్శకుడు గోపీచంద్ కు ఆ సెలబ్రిటీల నుంచి తీవ్ర నిరాశ ఎదురైందని తెలుస్తుంది.
గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబుతో ఎవరు పోటీ పడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
అరె ఏంటి భయ్యా.. ఈ బల్లి ఇంత వెరైటీగా ఉంది (వీడియో)