తెలుగు ప్రేక్షకులు బకరాలు అనుకుంటున్నారా.. విజయ్ “గోట్” సినిమా ఏం చెప్తుంది?

సాధారణంగా పెద్దగా బుర్ర ఉపయోగించని వారిని మేకల మందా లేదంటే గొర్రెల మంద అని పిలుస్తుంటారు.

వాడుక భాషలో బకరా లేదంటే గోట్ అంటారు.అయితే తమిళ సినిమా ఇండస్ట్రీ వాళ్లు తెలుగువారిని కూడా అలాగే ట్రీట్ చేస్తారేమో అనిపిస్తుంది.

ఎందుకంటే వాళ్లు తీసే కొన్ని సినిమాలు చూస్తే అవి చాలా చండాలంగా ఉంటాయి.

అయినా తెలుగు వారు చూస్తారులే అనే ధీమాతో వాటిని అడ్డదిడ్డంగా డబ్బు చేసి రిలీజ్ చేస్తారు.

తమిళ దర్శకులు, హీరోల్లో తెలుగు ప్రేక్షకుల గురించి ఒక చులకన భావన ఉండటం షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు.

ఈ రోజుల్లో దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఏజెంట్ల కథలకు ఫుల్లు డిమాండ్ ఉంది.

యాక్షన్, ఎమోషన్, ట్విస్ట్ ఇలా ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందని దర్శకులు భావిస్తున్నారు.

"""/" / రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ హీరో విజయ్( Tamil Hero Vijay ) సినిమా "గోట్"లో( GOAT Movie ) కూడా ఇలాంటివి చూపించి హిట్ కొట్టాలని చూశారు.

ఇందులో హీరో కొడుకునే విలన్‌గా చూపించారు.ఈ ట్విస్ట్ పేపర్ మీద ఇంట్రెస్టింగ్ గా అనిపించినా డైరెక్టర్ దాన్ని ఇంట్రెస్టింగ్‌గా తీయడంలో ఫెయిల్ అయ్యాడు.

ఇందులో ఎమోషన్స్ పూర్తిగా శూన్యం.యాక్షన్ సీన్లు, తుపాకీ కాల్పులు, ఎంత ఫైటింగ్ చేసినా మడత నలగని హీరోయిజం చూపించారు.

అందుకే గోట్ సినిమా బాగా దెబ్బతింది.ఈ సినిమా బాగుంటుందని థియేటర్లకు వెళ్లిన వారందరూ గోట్ అంటే బకరా అవుతారని చెప్పుకోవచ్చు.

"""/" / ఈ సినిమా పేరుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్( Greatest Of All Time ) కానీ సినిమా కంటెంట్ లో అంత దమ్ము లేదు.

సూర్య, రజినీ, విక్రమ్, ధనుష్, కమల్‌ హాసన్, సిద్ధార్థ్‌కు కూడా తెలుగులో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ తమిళ హీరోల సినిమాల్ని స్ట్రెయిట్ సినిమాల్లాగానే సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్.

అందుకే తమిళ నిర్మాతలు తమ సినిమాల్ని డబ్ చేసి తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతుంటారు.

కొన్ని తమిళ సినిమాల్లో( Tamil Movies ) ఓవరాక్షన్ బాగా ఎక్కువ అయిపోతుంటుంది.

పాటలలో తెలుగు పదాలు కూడా విచిత్రంగా అనిపిస్తాయి. """/" / సాధారణంగా ఒక కోలీవుడ్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగులో ప్రమోషన్లు చేస్తారు.

ఎంతోకొంత బజ్ కూడా వస్తుంది కానీ ఈ గోట్ సినిమాకు హైప్ కొంచెం కూడా క్రియేట్ కాలేదు.

అసలు ప్రమోషన్ లే చేయకుండా తెలుగు ప్రేక్షకులు( Telugu Audience ) చూసేస్తారులే అనే ధీమాతో ఆ మూవీని వదిలారు.

పూర్ ప్రజెంటేషన్, నేరేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ లు.యంగ్ విజయ్‌కు మేకప్, ఏఐ ఇంప్రూవ్‌మెంట్స్‌ అస్సలు సూట్ కాలేదు.

ఎలివేషన్లు బలవంతంగా జొప్పించారు.పూరెస్ట్ క్లైమాక్స్ వరస్ట్ అని చెప్పుకోవచ్చు.

సో మొత్తం మీద తెలుగు ప్రేక్షకులను బకరా చేయాలనే ఈ సినిమాని డబ్ చేసి వదిలారు.

దీన్ని చూడకపోవడమే మంచిది అని సినిమా చూసిన వాళ్లే పబ్లిక్ గా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

ప్రదర్శన సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురైన ‘గర్బా కింగ్’.. చివరకు(వీడియో)