సుప్రీం కోర్టు లో దొంగలు…మాల్యా కేసులో కొత్త ట్విస్ట్!

కొంతమందికి టైం అలా కలిసొస్తుందో ఏంటో మరి.దొంగలకు శిక్షలు విధించే సుప్రీం కోర్టులోనే దొంగలు పడ్డారు అంటే విచిత్రం అనే చెప్పాలి.

దేశంలో ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ను భారత్ కు తిరిగి రప్పించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో ఈ కేసుకు సంబంధించి కీలక ట్విస్ట్ సంతరించుకుంది.

ఈ డబ్బు ఎగవేతకు సంబంధించి రివ్యూ పిటీషన్ దాఖలు చేయగా ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అదృశ్యమైనట్లు సుప్రీం ధర్మాసనం గుర్తించింది.

త‌మ పిల్ల‌ల‌కు 40 మిలియ‌న్ల డాల‌ర్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన విష‌యంలో జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా సమీక్ష పిటీషన్ దాఖలు చేశారు.

అయితే తాజాగా ఈ సమీక్ష పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో వీడియో కాన్షరెన్స్‌‌లో విచారణ జరపాలని ప్రయత్నించగా దానికి సంబందించిన పత్రాలు మాయం అవడం తీవ్ర కలకలం రేపింది.

దీంతో న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20 కి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది.

మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

మాల్యా రివ్యూ పిటిషన్‌ని సంబంధిత కోర్టులో గత మూడేళ్లుగా ఎందుకు లిస్ట్ చేయలేదో స్పష్టం చేయాల్సిందిగా రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు.

అసలు ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్‌కి సంబంధించిన ఫైల్‌ను ఏయే అధికారులు డీల్ చేశారో అన్న వివరాలన్నింటినీ వెల్లడించాలి అంటూ సంబంధిత అధికారులను సూచించారు.

గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో ….120 మంది దత్తత తీసుకున్న విష్ణు!