రూ.140 కోట్ల సినిమాను ఇంత సింపుల్‌ గా విడుదల చేస్తారా?

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన మాస్టర్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకున సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈ సినిమాను కరోనా కారణంగా ఏడాది కాలంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఈ సినిమా బడ్జెట్‌ 140 కోట్లకు పైగానే అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అంత భారీ బడ్జెట్ సినిమా అవ్వడం వల్లే ఓటీటీ ఆఫర్‌ లు వచ్చినా అమ్మేయలేదు.

వంద కోట్ల వరకు ఈ సినిమాకు ఓటీటీ వారు పెట్టేందుకు ముందుకు వచ్చారు.

కాని మేకర్స్‌ మాత్రం సినిమాను విడుదల చేసేందుకు ఒప్పుకోలేదు.ఎట్టకేలకు థియేటర్లకు గ్రీన్‌ సిగ్నల్ రావడంతో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.

సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

కాని సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదల చేస్తే ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది అనేది అనుమానంగా ఉంది.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మొదటి రెండు మూడు రోజుల పాటు ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తారని అంటున్నారు.

కాని అలా చేసినా కూడా ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది అనేది మాత్రం అనుమానమే.

మొదటి వారం రోజుల్లో ఖచ్చితంగా 50 కోట్ల రూపాయల వరకు ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతానికి తమిళనాడులో ఆంక్షలను ఎత్తి వేయించేందుకు ప్రయత్నాలు జరిగుతున్నాయి.ఒక వేళ ఆంక్షలు ఎత్తివేస్తే పర్వాలేదు లేదంటే మాత్రం భారీ సినిమాకు సింపుల్‌ రిలీజ్‌ వల్ల నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ మాస్టర్‌ కు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.

10 కోట్లతో ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగిందట.

నా చర్మం వలిచి చెప్పులు కుట్టించి .. కోమటిరెడ్డి ఎమోషనల్ కామెంట్స్