ఆ సినిమా తెలుగు రైట్స్‌ కొన్న వారికి రక్త కన్నీరు మిగిలిందా?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ( Vijay )హీరో గా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వం లో వచ్చిన లియో సినిమా కి బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ ఎదురైంది.

తమిళ రాష్ట్రం లో ఒక మోస్తరు వసూళ్లు నమోదు అవుతున్నాయి.కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లియో సినిమా కి ఏమాత్రం కలెక్షన్స్ నమోదవడం లేదు.

ఇప్పటి వరకు మినిమం ఓపెనింగ్స్ దక్కలేదు అంటూ ప్రచారం జరుగుతుంది.విజయ్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు అంటూ సమాచారం అందుతుంది.

"""/" / ఇక కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో లేక పోవడంతో పోటీ పడి మరీ కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి ఏంటి అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయ్ సినిమా లకు తెలుగు లో మార్కెట్ లేదు.అయినా కూడా విక్రమ్ ఫలితం నేపథ్యం లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై చాలా నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ను తెలుగు బయ్యర్లు కాస్త ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.

విజయ్‌ గత సినిమాలు సాధించిన కలెక్షన్స్ తో పోలిస్తే లియో సినిమా ను దాదాపు మూడు రెట్ల ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడం జరిగింది.

కానీ ఈ సినిమా కూడా విజయ్ గత చిత్రాల మాదిరిగానే వసూళ్ల ను సాధిస్తుంది అని తేలి పోయింది.

"""/" / కనుక బయ్యర్స్ కి భారీ గా నష్టాలు తప్పవు అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ లియో ( LEO )సినిమా ఇప్పుడు తమిళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కనిపిస్తోంది.

ఇతర ఏ భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

తెలుగు లో లియో వేసిన థియేటర్లలో భగవంత్‌ కేసరి ( Bhagavanth Kesari )మరియు టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )సినిమాలను వేస్తున్నారు.

రెండవ రోజు నుండి థియేటర్లు తీసేస్తున్నారు అంటే ఆ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లోకేష్ కనకరాజ్‌ కోసం అయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు అంటే అది కూడా కనిపించడం లేదు.

బయ్యర్లు భారీ మొత్తాలు నష్టపోవాల్సిన పరిస్థితి.మరి నిర్మాత ఏమైనా వారికి సహాయం చేస్తాడేమో చూడాలి.

విజయ్ దేవరకొండ కి పాన్ ఇండియా మూవీ వర్కౌట్ అవుతుందా..?