లియో ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత టాలీవుడ్‌ లో బిజినెస్ పరిస్థితి ఏంటో?

సూపర్‌ స్టార్ విజయ్‌( Thalapathy Vijay ) మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నాడు అంటూ లియో ట్రైలర్‌ ని చూసిన తర్వాత చాలా మంది ఆయన ఫ్యాన్స్ తో పాటు మీడియా వారు మాట్లాడుకుంటున్నారు.

విజయ్ కి వంద.రెండు వందల కోట్ల వసూళ్లు సాధారణంగానే నమోదు అవుతాయి.

అలాంటిది లియో సినిమా( Leo Movie ) కు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం తో ఎన్ని వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతాయో ముందే అంచనా వేయలేక పోతున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తమిళనాట ఈజీగా మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అవ్వడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

అయితే టాలీవుడ్ లో మాత్రం నిన్న మొన్నటి వరకు లియో గురించి పెద్దగా పట్టింపు లేదు.

"""/" / లోకేష్ కనగరాజ్( Lokesh Kangaraj ) ని ఇష్టపడే వారు మాత్రం కొందరు లియో సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ సోషల్ మీడియాలో సందడి చేయడం మనం చూశాం.

తాజాగా లియో సినిమా ట్రైలర్‌ విడుదల అయింది.తెలుగు ప్రేక్షకుల అభిరుచికి కాస్త దూరంగానే సినిమా ఉండబోతుందా అన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే త్రిస ఉండటంతో పాటు ట్రైలర్‌ లో రెండు పాత్రలు అంటూ సస్పెన్స్ ని క్రియేట్‌ చేయడంతో బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు.

"""/" / హీరోగా విజయ్ కి గత సినిమాల అనుభవం నేపథ్యం లో యావరేజ్ మార్కెట్‌ ఉంది.

అయినా కూడా లియో సినిమా ట్రైలర్‌( Leo Movie Trailer ) కి పాజిటివ్ బజ్ రావడం, దర్శకుడు లోకేష్ కనగరాజ్ అవ్వడం వల్ల తెలుగు మార్కెట్‌ వద్ద లియో సందడి కనిపిస్తోంది.

విజయ్ గత సినిమాలతో పోల్చితే దాదాపుగా రెట్టింపు రేటు కి లియో ను తెలుగు నిర్మాతలు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారట.

మరి ఆ స్థాయి వసూళ్లు తెలుగు బాక్సాఫీస్ వద్ద లియో సాధిస్తుందా అనేది చూడాలి.

ఒమన్ సముద్రంలో మునిగిన చమురు నౌక .. 16 మంది గల్లంతు, అందులో 13 మంది భారతీయులే