Vijay : చెల్లి మరణంతో డాక్టర్ కావాలనుకున్నాడు.. హీరోగా పనికిరావన్నారు.. కొత్త పార్టీ పెట్టిన విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
TeluguStop.com
స్టార్ హీరో విజయ్ ( Vijay )తాజాగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు.
అయితే సరిగ్గా 90 రోజుల క్రితం విజయ్ దయచేసి ఓపిక పట్టాలని మన లక్ష్యం ఇది కాదని వేరే ఉందని అది గొప్పదని విజయ్ కామెంట్లు చేశారు.
ఆ దిశగా అడుగులు వేద్దామని భవిష్యత్తులో మనమేంటో చూపిద్దామని విజయ్ చెప్పుకొచ్చారు.నాపై అభిమానం చూపుతున్న ఫ్యాన్స్ కు ఏదైనా తప్పకుండా చేయాలనిపిస్తుందని విజయ్ పేర్కొన్నారు.
మీ కాలికి చెప్పులా ఉండటానికి కూడా నేను వెనుకాడనని ఆయన చెప్పుకొచ్చారు.తమిళగ వెట్రి కళగం( Tamilaga Vetri Kalagam ) పేరుతో విజయ్ కొత్త పార్టీని ప్రకటించారు.
అయితే విజయ్ కుటుంబం అతని బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.విజయ్ తల్లి శోభ గాయని కాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కావడం గమనార్హం.
విజయ్ చిన్నప్పుడు బాత్ రూమ్ కూడా లేని చిన్నగదిలో తల్లీదండ్రులతో కలిసి నివశించారు.
"""/" /
విజయ్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో చెల్లెలు విద్య మరణించడంతో అతను డాక్టర్ కావాలని భావించాడు.
అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో విజయ్ సినిమాలపై దృష్టి పెట్టడం జరిగింది.అయితే విజయ్ తండ్రికి మాత్రం విజయ్ సినిమాలలో నటించడం ఇష్టం లేదు.
విజయ్ విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేశారు.విజయ్ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించిన సమయంలో ఆయన హీరోగా పనికిరావని అన్నారు.
"""/" /
నాళయ తీర్పు అనే సినిమాతో విజయ్ కెరీర్ మొదలైంది.ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు విజయ్ నటనపై విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత విజయ్ సెందూరపాండిలో నటించారు.ఆ తర్వాత విజయ్ రసిగన్ అనే సినిమాలో నటించారు.
పొలిటికల్ గా సక్సెస్ సాధించి విజయ్ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారు.
అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్