లియో థియేటర్లోనే నిశ్చితార్థం చేసుకున్న విజయ్ అభిమానులు… మరీ ఇంత అభిమానమా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిలకు అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అభిమాన హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు చేసే హంగామా ఎలాగ ఉంటుందో మనకు తెలిసిందే.
ఈ విధంగా హీరోల పట్ల ఎంతోమంది వివిధ రకాలుగా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.
అయితే ఈ అభిమానం ఇంతవరకు ఉన్న పర్వాలేదు కానీ మరి హద్దులు దాటితే మాత్రం ప్రమాదాలు తలెత్తుతూ ఉంటాయని ఎన్నోసార్లు హీరోలు కూడా అభిమానులకు హితబోధ చేస్తూ ఉంటారు.
కానీ అభిమానులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తమ హీరో సినిమా వచ్చింది అంటే మేమే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలి అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు సాహసాలు కూడా చేస్తుంటారు.
"""/" /
ఇలాంటి ఒక విచిత్రమైన పని చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నారు హీరో విజయ్ ( Vijay ) అభిమానులు.
హీరో విజయ్ తాజాగా నటించిన లియో సినిమా( Leo Movie )ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శన అవుతూ ఉండగా విజయ్ అభిమానులు ఏకంగా థియేటర్లోనే ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం జరుపుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
పూర్తి వివరాలలోకి వెళ్తే తమిళనాడులోని.పుడుక్కోటి జిల్లాకు చెందిన వెంకటేశ్, మంజుల( Venkatesh, Manjula ).
దళపతి విజయ్‌కి వీరాభిమానులు.ఇక వీరిద్దరికి పెద్దలు వివాహం కూడా నిశ్చయించారు.
అయితే వివాహం నిశ్చయించిన తర్వాత వీరిద్దరూ అభిమానులు అనే విషయం తెలియడంతో ఇద్దరు కొన్ని విషయాలలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు.
విజయ్ నటించిన లియో రిలీజ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు.ఇలా ఈ సినిమా విడుదలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని దాదాపు 8 నెలల పాటు తమ పెళ్లి వాయిదా వేసుకున్నారు అయితే విజయ్ నటించిన లియో సినిమా విడుదల కావడంతో ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 20న పెళ్లి పెట్టుకున్నారు.
మొదటి రోజు సినిమా చూడటానికి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చినటువంటి ఈ జంట థియేటర్లోనే ఉంగరాలు మార్చుకొని అనంతరం దండలు మార్చుకొని సందడి చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024