మొదటికి మోసం తెచ్చిన పూరీ గేమ్.. లైగర్ లో ఆయనుంటే మరోలా ఉండేదట!

పూరీ జగన్నాథ్ అంటేనే మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో మెప్పిస్తాడు.

అలాగే మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో పూరీ ముందు వరుసలో ఉంటాడు.

ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యాయి.

కానీ ఈసారి మాత్రం లెక్క తప్పింది.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా మ్యూజిక్ లో కాదు కదా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.

గత సినిమా ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్.మరి ఇదే మ్యాజిక్ ను లైగర్ కంటిన్యూ చేయలేక పోయింది.

దీంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.సరైన సాంగ్ సినిమాలో ఒక్కటి కూడా లేకపోవడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

మరి పూరీ ఏమి ఆలోచించాడో తెలియదు కానీ మ్యూజిక్ మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

పాన్ ఇండియా సినిమాకు మ్యూజిక్ గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ పెట్టకుండా చేయడం అందరిని ఆశ్చర్య పోతుంది.

"""/" / ఈ పాయింట్ నే లైగర్ సినిమాకు మైనస్ గా మారిపోయింది.

అసలు ఈ సినిమాకు ముందుగా మణిశర్మ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మణిశర్మ మొదలు పెట్టిన తర్వాతనే ఈయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

ఈయన స్థానంలో ఎవరు సంగీతం అందిస్తారా అని అందరు ఎదురు చూసారు.అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో కొంత మంది పాప్ సింగర్స్ మ్యూజిక్ ఇచ్చారని తెలిసి అందరు షాక్ అవుతున్నారు.

వీరు అందించిన సంగీతం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది.ఒకటి అరా మినహా పెద్దగా ఆకట్టుకున్న పాటలు లేవు.

అదే కనుక మణిశర్మ సంగీతం అందించి ఉంటే ఈ సినిమా మరోలా ఉండేది అని అందరు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి సినిమాలు వీళ్లకు శాపంగా మారయా..?